ప్రధాని మోదీ నీడను తాకితే.. కేసీఆర్ చేసిన పాపాలు కొన్నైనా పోతయ్: అర్వింద్

ప్రధాని మోదీ నీడను తాకితే కేసీఆర్ చేసిన పాపాలు కొన్నైనా పోతాయంటు విమర్శించారు బీజేపీ ఎంపీ అర్వింద్.  రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు తెచ్చిన ప్రధాని మోడీని కేసీఆర్ రిసీవ్ చేసుకోకపోవడం సిగ్గు చేటన్నారు. మోడీ నీడను తాకితే కేసీఆర్ ఆయుష్సు పెరుగుతుందని వ్యాఖ్యానించారు. 

పసుపు బోర్టు తెచ్చి తన నాన్న  పేరును నిలబెట్టానని అర్వింద్ అన్నారు. అయితే డ్రగ్స్ దందాతో కేటీఆర్, లిక్కర్ దందాతో కవిత కూడా వాళ్ల నాన్న పేరు నిలబెట్టారని సెటైర్లు వేశారు.దోచుకోవడానికే కవిత, కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని మండిపడ్డారు. కవిత,కేటీఆర్ ను చూసి ప్రజలు, రైతులు తలదించుకుంటున్నారని ధ్వజమెత్తారు. నారీశక్తి,భారత శక్తితో కవితకు ఏం సంబంధం అని ప్రశ్నించారు..   

రైతులకు ప్రయోజనం చేకూర్చడమే కేంద్రం లక్ష్యమని అర్వింద్ అన్నారు.  పసుపు బోర్టు ప్రకటించిన మోడీకి కృతజ్ఞతలు తెలిపిను ఆయన.. పసుపు బోర్టు ప్రకటనతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రధాని ప్రకటనతో రాజకీయ నేతలపై రైతులకు భరోసా వచ్చిందన్నారు. పసుపు బోర్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేశామన్నారు.  పసుపు బోర్టు ఏర్పాటులో కేంద్రహోంమంత్రి అమిత్ షా,  బీజేపీ రాష్ట్ర ఛీప్ కిషన్ రెడ్డి చొరవ ఎంతో ఉందని చెప్పారు.  పసుపు రైతుల చిరకాల కోరిక నేరవేరిందన్నారు. మోడీ ప్రకటనతో పసుపు రైతుల శ్రమకు ఫలితం దక్కిందన్నారు.  పసుపు ఏర్పాటు కావడం పసుపు రైతులు చేసుకున్న అదృష్టమన్నారు.  మోడీ ప్రపంచ రాజకీయాలను చిటికెన వేలు మీద నడుపుతున్నారని కొనియాడారు. ఇందూరు నుంచే రాష్ట్ర మార్పు మొదలవుతుందన్నారు అర్వింద్