కల్వకుంట్ల కవిత బినామీలు అభిషేక రావు, పిళ్లైలు లిక్కర్ పాలసీ రూపొందించారని బీజేపీ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ఢిల్లీలో 2శాతం ఉన్న లిక్కర్ పాలసీని 12 శాతానికి పెంచి కుంభకోణం చేసింది కవిత కాదా అని ప్రశ్నించారు. లిక్కర్ పాలసీతో ఢిల్లీ ప్రజల సొమ్మును ముంచింది వారేనని అన్నారు. ప్రభుత్వ లిక్కర్ డీలర్షిప్ను ప్రైవేట్ పరం చేశారన్నారు.
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో రైతు నాయకుడు తిరుపతి రెడ్డిని అర్వింద్ పరామార్శించారు. కేసీఆర్ ఏ పార్టీ పెట్టుకున్న అభ్యంతరం లేదని.. ఆయన పిళ్లైలతో సమానమని విమర్శించారు. ఎన్ని పార్టీలు పెట్టిన కేసీఆర్ను చిత్తుచిత్తుగా ఓడిస్తామన్నారు.