‘నేషనల్ హెరాల్డ్ కీ లూట్’.. క్యాప్షన్ బ్యాగ్​తో బీజేపీ ఎంపీ

‘నేషనల్ హెరాల్డ్ కీ లూట్’.. క్యాప్షన్ బ్యాగ్​తో బీజేపీ ఎంపీ
  • పార్లమెంటులో జేపీసీ మీటింగ్​కు హాజరైన బన్సూరి స్వరాజ్

న్యూఢిల్లీ:  ‘‘నేషనల్ హెరాల్డ్ కీ లూట్” అని రాసి ఉన్న  హ్యాండ్ బ్యాగుతో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ జాయింట్​ పార్లమెంటు కమిటీ(జేపీసీ) మీటింగ్​కు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ న్యూస్​పేపర్,​  అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) అంశంలో మనీలాండరింగ్ జరిగిందని కాంగ్రెస్​అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఇటీవల చార్జ్​షీట్ ​దాఖలు చేయడాన్ని హైలెట్​ చేసేందుకు ఎంపీ బన్సూరి ఇలా చేశారు. 

గతంలో పాలస్తీనా, బంగ్లాదేశ్ అంశాలకు సంబంధించిన కోట్స్ రాసిన బ్యాగులతో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పార్లమెంట్ కు హాజరయ్యారయ్యారు. ఇప్పుడు ఆమెకు కౌంటర్ గా  బీజేపీ ఎంపీ బన్సూరి కూడా మంగళవారం అదే తరహా బ్యాగ్ తో జేపీసీ మీటింగ్ కు రావడం విశేషం.