స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి : బూర నర్సయ్య గౌడ్

  • 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి
  • బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ 

హైదరాబాద్, వెలుగు: కులగణనను వచ్చేనెల 15లోగా పూర్తి చేసి, జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కోరారు. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళన చేపట్టాలని, కానీ ముందుగా వ్యర్థాలను మళ్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.