ప్రియాంకా గాంధీకి ‘1984 అల్లర్లు’ బ్యాగ్‌‌‌‌ గిఫ్ట్‌‌‌‌గా ఇచ్చిన బీజేపీ ఎంపీ అపరాజిత

ప్రియాంకా గాంధీకి ‘1984 అల్లర్లు’ బ్యాగ్‌‌‌‌ గిఫ్ట్‌‌‌‌గా ఇచ్చిన బీజేపీ ఎంపీ అపరాజిత

న్యూఢిల్లీ: బీజేపీ భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌ ఎంపీ అపరాజిత సారంగి కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ ప్రియాంకా గాంధీకి ‘1984 అల్లర్లు’(సిక్కు వ్యతిరేక అల్లర్లు) అని రాసి ఉన్న బ్యాగ్‌‌‌‌ను గిఫ్ట్‌‌‌‌గా ఇచ్చారు. శుక్రవారం అపరాజిత పార్లమెంట్‌‌‌‌ కారిడార్‌‌‌‌‌‌‌‌లో ప్రియాంకను కలిసి బ్యాగ్‌‌‌‌ అందజేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రియాంక కూడా ఆమె ఇచ్చిన బ్యాగ్‌‌‌‌ను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ప్రియాంక నిజమైన కాంగ్రెస్‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ అయితే, 1984 అల్లర్లకు సంబంధించి కూడా మాట్లాడాలని అపరాజిత డిమాండ్‌‌‌‌ చేశారు. కాగా, పాలస్తీనా ప్రజలకు మద్దతు తెలుపుతూ సోమవారం పార్లమెంట్‌‌‌‌కు ‘పాలస్తీనా’అని రాసి ఉన్న బ్యాగ్‌‌‌‌ను ప్రియాంక తీసుకొచ్చారు. ఆ మరుసటి రోజు ‘బంగ్లాదేశ్‌‌‌‌లో హిందువులకు, క్రైస్తవులకు అండగా నిలబడడండి’అని రాసి ఉన్న బ్యాగ్‌‌‌‌ను వేసుకొని వచ్చారు.
 

మరిన్ని వార్తలు