హైదరాబాద్లో కుస్తీ.. చెన్నైలో దోస్తీ : ఎంపీ​ధర్మపురి అర్వింద్​

హైదరాబాద్లో కుస్తీ.. చెన్నైలో దోస్తీ : ఎంపీ​ధర్మపురి అర్వింద్​

ఢిల్లీ: డీలిమిటేషన్ మీటింగ్ లో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏం పని? అని నిజామాబాద్ ఎంపీ​ధర్మపురి అర్వింద్ నిలదీశారు.  బీఆర్ఎస్ వ్యవహారం హైదరాబాద్లో కుస్తీ.. చెన్నైలో దోస్తీలా మారిందని సెటైర్​వేశారు. ఢిల్లీలో అర్వింద్​మాట్లాడుతూ ‘డీఎంకే డీలిమిటేషన్ సమావేశంలో కాంగ్రెస్ సీఎంతో పాటు కేటీఆర్ కూడా పాల్గొన్నారు. అంటే ఇండియా కూటమిలో బీఆర్ఎస్ చేరిపోయిందా? నా ఓపినియన్ ప్రకారం ఈ నీచమైన సహజీవనం భవిష్యత్తులో కూడా ఏదో ఒక విధంగా కొనసాగుతుంది’’ అని అన్నారు. 

‘నియోజకవర్గాల పునర్విభజనతో తమిళనాడు మినహా ఇతర దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కామన్ సివిల్ కోడ్, ఎన్‌ఆర్‌సీకి సపోర్ట్ చేస్తారా? స్టాలిన్, ఉదయ్ నిధి స్టాలిన్ లాంటి దుర్మార్గులు ఏ కమ్యూనిటిలో ఉండకూడదు. తెలంగాణలో 80 శాతం మైనార్టీలను బీసీల్లో కలిపారు. మేం అధికారంలోకి వచ్చాక బీసీల నుంచి మైనారిటీలను తొలగిస్తం. మతపరమైన రిజర్వేషన్లు అమలు చేయం’ అని తెలిపారు.