
- రాష్ట్ర పాలనను గాలికి వదిలిన కల్వకుంట్ల కుటుంబం
- దౌల్తాబాద్ కార్నర్ మీటింగ్‌లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
తొగుట, (దౌల్తాబాద్) వెలుగు : కేటీఆర్ ఓటమి భయంతోనే చిల్లరగా మాట్లాడుతున్నాడని కల్వకుంట్ల కుటుంబానికి ఓటమి భయం పట్టుకుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో మహిళలు, యువకుల కలిసి కార్నర్ మీటింగ్ మీటింగ్ లో ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలసి మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు 20 సీట్లు దాటవని జోస్యం చెప్పారు. బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి 4 సిలిండర్ లు ఉచితంగా ఇస్తామన్నారు.
సిరిసిల్లలో కేటీఆర్ రెండో స్థానానికి వెళ్లాడని తెలిపారు. అందుకే మతి భ్రమించి బహిరంగ సభల్లో బూతులు మాట్లాడుతున్నాడని తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే అని ఎవరికి ఓటు వేసినా చివరికి కారు గుర్తులో కలుస్తారన్నారు. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే పిల్లర్లు కుంగి పోయాయన్నారు. కల్వకుంట్ల కుటుంబ కమిషన్ల కోసం వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు
మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత 13 కోట్ల రూపాయలతో దౌల్తాబాద్ బస్టాండ్ నుంచి చేగుంట వరకు డబుల్ రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు. గొల్లపల్లి రోడ్డు ఉందని అసలు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి తెలుసా అని ప్రశ్నించారు. దౌల్తాబాద్ మీటింగ్ లో నన్ను తిట్టిన కేటీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో దౌల్తాబాద్ మండలంలో ఎన్నో భుకబ్జాలు జరిగాయని ఆరోపించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కిషన్, సుచిత్ గౌడ్, గణేశ్ గౌడ్ పలువురు పాల్గొన్నారు.
Also Read :- నవంబర్ 24, 25న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ