హైదరాబాద్, వెలుగు: పసుపు బోర్డు కార్యకలాపాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అవగాహన లేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. పసుపు బోర్డు ఎక్కడ పెట్టాలో తమకు తెలుసని, రేవంత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో అర్వింద్ మీడియాతో మాట్లాడారు. మంత్రిగా పనిచేసిన అనుభవం రేవంత్ రెడ్డికి లేదని, ఇకపై జీవితంలో ఎప్పుడూ మంత్రి కాలేరని విమర్శించారు.
‘‘పసుపు పంటను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే.. చెరుకు ఫ్యాక్టరీలు కనుమరుగయ్యేలా చేసింది టీడీపీ. రేవంత్ గురువు జైల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వీడేది తెలియదు. కొడంగల్‌లో తరిమితే మల్కాజి గిరిలో వచ్చి పడ్డడు. సగం పార్లమెంట్ సీట్ల లో కాంగ్రెస్ అడ్రస్ లేదు. 61 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి?”అని అర్వింద్ ప్రశ్నిం చారు. అదానీని పైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ అని అన్నారు. అదానీ వ్యాపారం విస్తరించిం దే కాంగ్రెస్ హయాంలో అని విమర్శించారు.