ఆధార్ కార్డు చూపించి నన్ను కలవాలి: ఎంపీ కంగనా కామెంట్స్పై తీవ్రవిమర్శలు

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తనను కలిసేందుకు వచ్చేవారు ఎవరైనా సరే తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాలి అనడంపై రాజకీ య దుమారం రేపింది. ఒక ప్రజాప్రతినిధిని..అందునా ప్రజలు ఎన్నుకున్న ఎంపీని కలిసేందుకు ఆధార్ కార్డు చూపించి కలవాల్సి దుస్థితి ఏందని ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. 

బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి పార్లమెంట్ ఎన్నికైన కంగనా రనౌత్..మండి నియోజకవర్గ ప్రజలు తనను కలవాలంటే ఆధార్ కార్డులను తీసుకురావాలని కోరడం కలకలం రేపింది. తనను కలవానుకునేవారు కాగితంపై ఏ పనిమీద వచ్చారో స్పష్టంగా రాయాలని చెప్పడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. 

అయితే కంగనా తన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. హిమాచల్ ప్రదేశ్  పర్యాటక ప్రాంతం..చాలా మంది బయటి వ్యక్తులు ఇక్కడికి వస్తుంటారు. అందుకే ఈ నిబంధనలు పెట్టినట్టు చెప్పారు. లోక్ సభ లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మండికి వచ్చిన సమయంలో పర్యాటకులు తనను కలిసేందుకు వస్తుం టారు. వారికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని కంగనా చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన పనిని పేపర్లో రాసి ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. 

కాంగ్రెస్ నేతలు ఎలా రియాక్ట్ అయ్యారంటే.. 

జూలై 11న ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. కంగనాపై హిమాచల్ కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక ప్రజా ప్రతినిధి తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రజలు కలవాలంటే తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు తీసుకురావలని కోరడం సరికాదన్నారు. 

కంగనా ఇంతకు ముందు కూడా వార్త హెడ్ లైన్ లో నిలిచారు. ఇటీవల చండీగఢ్ విమానాశ్రయంలో CISF సిబ్బంది ఆమెను చెప్పుతో చెంపపై కొట్టడం పెద్ద దుమారమే రేగింది. పంజాబ్,హర్యానా సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రౌతులపై కంగనా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెను కొట్టినట్లు CISF  సిబ్బంది  కుల్విందర్  కౌర్ తెలిపింది. అయితే కుల్విందర్ తాత్కాలికంగా విధులను తొలగించారు. తర్వాత బెంగళూరు విమానాశ్రయంలో తిరిగి విధుల్లోకి చేర్చుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు చెపుతున్నాయి.