హైడ్రా సూపర్..ఎక్స్​లో 87 శాతం మంది ఒపీనియన్​

హైదరాబాద్, వెలుగు : హైడ్రా కూలుస్తున్న అక్రమ నిర్మాణాలపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి ట్విట్టర్​(ఎక్స్​)లో ఓటింగ్ పెట్టారు. రాత్రి 11 గంటల వరకు 421 మంది ఇందులో పాల్గొనగా.. ఇందులో 83 శాతం మంది హైడ్రా గొప్ప పని చేస్తున్నదని అభిప్రాయపడ్డారు.  

హైడ్రా కూల్చివేతలు ఆపాలని 17 శాతం మంది చెప్పారు. హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం శుభపరిణామమని చాలామంది కామెంట్స్​ చేశారు. అయితే, ఇది ఎంత కాలం ఉంటుందో చూడాలని పలువురు వ్యాఖ్యానించారు.