ఉమ్మడి రాష్ట్రంలోనూ 8 ఎంపీ సీట్లు రాలే: లక్ష్మణ్

ఉమ్మడి రాష్ట్రంలోనూ 8 ఎంపీ సీట్లు రాలే: లక్ష్మణ్

ఉమ్మడి ఏపీలోనూ బీజేపీకి ఏనాడు 8 ఎంపీ సీట్లు రాలేదన్నారు ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి 35శాతం ఓట్లు సాధించామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నారు. 2024, జూన్ 6వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. లోక్  సభ ఎన్నికలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిందన్నారు. మెదక్, కరీంనగర్ లోనూ బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయిందన్నారు. 

కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు లక్ష్మణ్.  అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. భారాస ఎమ్మెల్యే కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని మంత్రులు చెబుతున్నారని.. ఆ పార్టీ త్వరలోనే ఖాళీ అవుతుందని అన్నారు.  రాష్ట్రాభివృద్ధి కోసం భాజపా ఎంపీలు కట్టుబడి ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని గెలిపించారని లక్ష్మణ్ అన్నారు.