దేశంలోనే అత్యంత అవినీతి సర్కార్ కేసీఆర్‌‌‌‌దే : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్‌‌, వెలుగు : దేశంలోనే అత్యంత అవినీతి సర్కార్ ఏదైనా ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. అవినీతిలో కూరుకుపోయిన  కేసీఆర్‌‌‌‌కు ముఖం చెల్లకనే వరంగల్‌‌లో జరిగిన ప్రధాని మోదీ టూర్‌‌‌‌కు దూరంగా ఉన్నారన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. 

రాష్ట్రంలో ఈ తొమ్మిదేండ్లలో కేసీఆర్ సర్కార్ కుటుంబ పాలనగా మారిందని మండిపడ్డారు. ఇది 30 శాతం కమీషన్ సర్కార్ అని, దళిత బంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే 30% కమీషన్ తీసుకుంటున్నారని స్వయంగా సీఎం కేసీఆరే ఆరోపించారని గుర్తుచేశారు. రైతుల పట్ల కాంగ్రెస్‌‌కు చిత్తశుద్ధి లేదని, అందుకే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్‌‌పై తమ మేనిఫెస్టోలో బీజేపీ విధానాన్ని తెలియజేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా టిఫిన్ బైఠక్‌‌లతో కార్యకర్తల మధ్య ఆత్మీయత పెరుగుతుందని పేర్కొన్నారు.