ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలి : ఎంపీ లక్ష్మణ్

ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలి :  ఎంపీ లక్ష్మణ్
  • ప్రభుత్వానికి లక్ష్మణ్ డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి సంబంధించిన అలైన్ మెంట్ లో గత ప్రభుత్వం ఎందుకు మార్పులు చేసిందో బయటపెట్టాలని రాష్ట్ర సర్కారును బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కోరారు. ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ ను ఓఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్లకు ప్రతిపాదనలు చేసి, నల్గొండ ప్రాంతంలో మాత్రం 28 కిలోమీటర్లకు కుదించారని గుర్తుచేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు.  

శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ట్రీపుల్ ఆర్ బాధితులు ఎంపీ లక్ష్మణ్ ను కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ...గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల భువనగిరి, నల్గొండ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దాదాపు మూడుసార్లు ఈ ప్రాంత ప్రజలు భూములు కోల్పోయారని వివరించారు.