
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయాలని చూస్తోందని, వాటి జోలికి వెళ్తే ఉపేక్షించేది లేదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హెచ్చరించారు. శనివారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటాలకు సిద్ధమవుతామన్నారు. విలువైన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఇచ్చిన గ్యారెంటీలను తీరుస్తామంటే ఊరుకునేది లేదన్నారు. భూముల అమ్మకంపై పునరాలోచన చేయాలని కోరారు. ఈ స్థలం నెమళ్లు, జింకలు, అనేక రకాల పక్షులు, అరుదైన వృక్ష, జీవ సంపదకు నిలయంగా ఉందన్నారు.