
- రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీది గడిచిన చరిత్ర: ఎంపీ లక్ష్మణ్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీది గడిచిన చరిత్ర అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పదేండ్లు గొప్పగా పాలించామని చెప్పుకొంటున్న ఆ పార్టీ, తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టలేని దుస్థితికి చేరిందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసిందని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చి, ప్రధాని మోదీకి కానుకగా ఇస్తామన్నారు.
శుక్రవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ఉగాది పండుగ తర్వాత వచ్చే నాలుగేండ్లకు సంబంధించి త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరెలా కార్యాచరణ ఉండనుందని తెలిపారు.