కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టం.. పడిపోతే కాపాడలేం : లక్ష్మణ్

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను తాము కూల్చబోమని, ఎవరైనా కూలగొడితే తాము కాపాడలేమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ . జగిత్యాలలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో లక్ష్మణ్ ఈ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణలో డబుల్ ఇంజన్  సర్కార్ కు మార్గం సుగమం అవుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ తెలంగాణలో అవసరమా అని లక్ష్మణ్ ప్రశ్నించారు.  

గేట్లు తేరుచామని సీఎం రేవంత్ అంటున్నారని ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి పోకుండా చూసుకోవాలని లక్ష్మణ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పారిపోయేలా ఉన్నారు కాపాడుకోవాలన్నారు.  ఆరు గ్యారెంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వంద రోజులైనా హామీలు అమలుచేయడం లేదని విమర్శించారు.  రేవంత్  ..  కేసీఆర్‌ను మరిపిస్తున్నారని ఎద్దెవా చేశారు. మాటలు చెప్పడంలో కేసీఆర్ ను రేవంత్ మించి పోయాడన్నారు లక్ష్మణ్.