నల్గొండ, వెలుగు: ఉచిత హామీల పేరిట ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్అన్నారు. శుక్రవారం నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్ల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆయన సమీక్ష చేశారు. లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ మోసపూరిత హామీలతో గెలిచిందన్నారు.
బీఆర్‌ఎస్‌ది ముగిసిన చరిత్ర అని, కాంగ్రెస్ మునగబోయేదన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోవడం వల్లే కాంగ్రెస్‌కు లాభం జరిగిందన్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందన్నారు. దాంతో పాటు ఎనిమిది స్థానాల్లో తమ అభ్యర్థులు గెలుపొందారన్నారు. 22 మంది స్వల్ప తేడాతో ఓడిపోయారని, వచ్చే పార్లమెంట్ఎన్నికల్లో 10 స్థానాలు గెలిచి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువత మొత్తం బీజేపీవైపే ఉందన్నారు. బీజేపీ కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ఈ సమావేశంలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంకనాల శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి, నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, శ్రీదేవిరెడ్డి, వర్షిత్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, బండారు ప్రసాద్, నివేదితారెడ్డి, రవికుమార్, చక్రవర్తి, లాలునాయక్, శ్రీనివాసరావు, లింగస్వామి, రవిగౌడ్, బాష పాల్గొన్నారు.