బీసీలను ప్రలోభ పెట్టేందుకే కుల గణన

  • రాహుల్​ గాంధీ కుటుంబంతోనే బీసీలకు తీవ్ర అన్యాయం : లక్ష్మణ్​

హైదరాబాద్, వెలుగు : బీసీలను రాజ కీయంగా ప్రలోభ పెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనను తెరమీదికి తెచ్చిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్  అన్నారు. కులగణన దేశానికి మోడల్ అవుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల విషయంలో అనేక తప్పిదాలు చేశారని అన్నారు. 

శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో లక్ష్మణ్​ మీడియాతో మాట్లాడా రు. దేశంలో దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కుటుంబంతోనే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. బీసీ లకు  కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని లక్ష్మణ్​ డిమాండ్ చేశారు.