రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించడమే లక్ష్యం

పార్టీలో తనపై మరింత బాధ్యత పెరిగిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సామాన్య కార్యకర్త కూడా ఉన్నత స్థానానికి వెళ్లగలడు అనేదానికి తానే నిదర్శనమని చెప్పారు. ఇది మంచి సంకేతంగా భావిస్తున్నానన్న ఆయన..వెంకయ్య నాయుడు తరువాత ఏపీ, తెలంగాణలో అరుదైన గుర్తింపు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని.. జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.

రాష్ట్రంలో కుటుంబ, అవినీతి పాలనను అంతమొందించడమే బీజేపీ లక్ష్యమని లక్ష్మణ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పట్ల ప్రజలు నమ్మకం కోల్పోయారన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్న ఆయన.. మునుగోడులో ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నట్లు తెలిపారు. హుజురాబాద్, దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ తరహాలో మునుగోడులో బీజేపీ గెలువబోతోందన్నారు. ఎన్నికల హామీలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కితున్నారన్న ఆయన..ఎన్నికలు వస్తే తప్పా సంక్షేమ పథకాలు గుర్తుకు రావడం లేదని మండిపడ్డారు.