ప్రభుత్వ తీరు సరికాదు.. అల్లు అర్జున్‎కు అండగా నిలిచిన బీజేపీ MP లక్ష్మణ్

ప్రభుత్వ తీరు సరికాదు.. అల్లు అర్జున్‎కు అండగా నిలిచిన బీజేపీ MP లక్ష్మణ్

హైదరాబాద్: సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కి సలాట, తదనంతర పరిణామాలతో హీరో అల్లు అర్జున్‎పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అల్లు అర్జున్  బాధ్యతరాహిత్యం వల్లే తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళా ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతలు సైతం బహిరంగంగానే అల్లు అర్జున్‎పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అల్లు అర్జున్‎కు అండగా నిలిచారు.

 బన్నీకి సపోర్ట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని లక్ష్మణ్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం (డిసెంబర్ 22) ఎంపీ లక్ష్మణ్ ఓ వీడియో విడుదల చేశారు. జాతీయ అవార్డ్ గ్రహీత అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరు సరికాదని అన్నారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని కించపరిచి.. అతడి క్యారెక్టర్‎ను తక్కువ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ఇండస్ట్రీ గౌరవాన్ని తగ్గించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఫైర్ అయ్యారు. 

కాగా, 2024, డిసెంబర్ 4వ తేదీ రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అభిమానులతో కలిసి మూవీ చూసేందుకు బన్నీ థియేటర్‎కు రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో థియేటర్ లో తొక్కిసలాట జరిగి ఫ్యామిలీతో కలిసి మూవీ చూసేందుకు వచ్చిన ఓ మహిళా ప్రాణాలు కోల్పోయింది.

 ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం వెంటిలేటర్‎పై చికిత్స పొందుతున్నాడు. బన్నీ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అల్లు అర్జున్‎పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తొక్కి సలాట జరిగి ఓ మహిళా మృతి చెందగా.. ఆమె కుమారుడు ఇప్పటికే ఐసీయూలోనే ఉన్నాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్ రియాక్ట్ అయిన విధానంపై సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.