కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య. పార్లమెటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని.. జాతీయస్థాయిలో కులగణన చేపట్టాలని అన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, కేంద్ర బడ్జెట్ లో బీసీలకు 51వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు కృష్ణయ్య. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనను బీజేపీ ఎంపీలు తప్పుబట్టారని అన్నారు కృష్ణయ్య. పంచాయితీ రాజ్ చట్టాన్ని సవరించాలని.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
ALSO READ | సీఎం రేవంత్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపిన మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం
రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించకపోతే ఉద్యమిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో చాలా తప్పులున్నాయని.. అనేక కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. బీసీ నేతలతో తనను తిట్టించి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.