బీసీలను రాజకీయంగా అణచివేసే కుట్ర : ఎంపీ ఆర్.కృష్ణయ్య

బీసీలను రాజకీయంగా అణచివేసే కుట్ర : ఎంపీ ఆర్.కృష్ణయ్య
  • కులగణన తప్పుల తడకగా ఉంది

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడకగా ఉంద ని బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. కొండ ను తవ్వి ఎలకను పట్టినట్లుగా కులగణనలో బీసీల శాతాన్ని తగ్గించి చూపించారని.. ఇది బీసీలను రాజకీయంగా అణచివేసే కుట్ర అని ఆరోపించారు. ఇప్పటికైనా బీసీ వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే రాష్ట్రం రణరంగమవుతుందని హెచ్చరించారు. బీసీలు తిరగబడితే.. రేవంత్‌ రెడ్డి సర్కార్ పడిపోతుందన్నారు.

బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కులగణన లెక్కలపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి.. దానిని ఎందుకు చట్టం చేయలేదని ప్రశ్నించారు.