చట్టం ముందు అందరూ సమానమేనన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఫార్ములా ఈ రేస్ కేసు లొట్టపీసు కేసన్న కేటీఆర్ కు చలిజ్వరం పుట్టిందన్నారు. తప్పుచేయకపోతే ఏసీబీ విచారణకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకావాలన్నారు. కేటీఆర్ చేసిన తప్పును అంగీకరించి ఏసీబీకి లొంగిపోవాలని సూచించారు. అధికారం పోయి 13 నెలలైనా కేటీఆర్ కు అహంకారం తగ్గలేదని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డికి మాట్లాడే హక్కు ఎంతుందో తనకు అంతే ఉందన్నారు రఘునందన్ రావు. బిజెపి ఆఫీస్ దగ్గరికి వచ్చి దొంగల్లాగా కార్యకర్తల మీద దాడి చేసి తలలు పగలగొడతామంటే ఊరుకోమన్నారు. దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే.. బీజేపీ 20 రాష్ట్రాల్లో ఉందన్నారు. బీజేపీ ఆఫీసులపై దాడి చేయాలనుకుంటే ఏ పార్టీ కూడా మిగలదన్నారు రఘునందన్ రావు . ఆఫీసులపై అమాయక కార్యకర్తలపై దాడి చేయడం మానుకోవాలని సూచించారు
ALSO READ | కేటీఆర్ కేసులో బిగ్ ట్విస్ట్: సుప్రీంకోర్టులో ముందుగానే పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం