రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీ  సంజయ్ జైశ్వాల్ రాహుల్ గాంధీ కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి ఎప్పటికీ దేశభక్తుడు కాలేడని జైస్వాల్ వ్యాఖ్యానించారు. 2 వేల   సంవత్సరాల క్రితం చాణక్యుడు చెప్పిన మాటలనే.. తాను  ఈ రోజు  గుర్తు చేశానని సమర్థించుకున్నారు.  విదేశాల్లో ఇండియాను రాహుల్ గాంధీ అవమానించారని... మన ప్రజాస్వామ్యం, కోర్టులు, జర్నలిస్టులు అన్నీ తప్పు అని అన్నారంటే.. రాహుల్  భారతదేశాన్ని విశ్వసించరని స్పష్టమవుతోందని విమర్శించారు.

తనను తాను యువరాజుగా భావించిన రాహుల్ గాంధీ ప్రధాని మోడీ వల్ల ఆందోళనకు గురయ్యాడని జైశ్వాల్ అన్నారు.. రాహుల్ ఓబీసీ వర్గాన్ని కించపరిచారని విమర్శించారు. రాహుల్ గాంధీ అణగారిన వర్గాల పట్ల అవమానంకరంగా ప్రసంగం చేశారని ఆరోపించారు. అతను ఎక్కడికెళ్లినా ఓబీసీ ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిచారు.

భోపాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్   కొన్ని రోజుల క్రితం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. రాహుల్‌ను దేశంలో రాజకీయాలు చేయొద్దని, భారత్‌ నుంచి తరిమి కొట్టాలని ఆమె కామెంట్ చేశారు.  రాహుల్ గాంధీ భారతదేశానికి చెందినవాడు కాదని వారు అంగీకరిస్తున్నారని ఆమె అన్నారు. ‘రాహుల్ భారతదేశానికి చెందినవాడని తమకు తెలుసు...కానీ విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి  దేశభక్తుడు కాలేడని రాహుల్ గాంధీ నిరూపించారని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అన్నారు.