సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారు.. నేను అలా అనలేదు : ఎంపీ బాపురావు

సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారు.. నేను అలా అనలేదు : ఎంపీ బాపురావు

తన కామెంట్స్ పై సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్, కామెంట్స్ పై బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. బీజేపీ పార్టీ క్యాడర్ చిట్ చాట్ లో తాను మాట్లాడిన కామెంట్స్ ను వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్  ప్రొసీజర్స్ మేరకే రిలీజ్ చేస్తారని చెప్పారు. తనపై బురద జల్లేందుకు కొన్ని గ్రూపులు దుష్ర్పచారం చేస్తున్నాయని ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. 

తాను త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు కొంతమంది కావాలనే ప్రచారం చేస్తున్నారని ఎంపీ సోయం బాపురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారంలో మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, జిల్లా ప్రెసిడెంట్ శంకర్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు స్వాహా చేసినట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన చివరిశ్వాస వరకు బీజేపీలోనే కొనసాగుతానని చెప్పారు. 

ఎంపీ ల్యాడ్స్‌ నిధులను తన ఇంటి నిర్మాణంతో పాటు కొడుకు పెళ్లి కోసం కూడా వాడుకున్నానని బాపురావు చెప్పినట్లుగా ఉదయం నుంచి మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఎంపీ బాపురావు స్పందించి.. వివరణ ఇచ్చారు.