అమిత్ షాకు క్రీడల శాఖ బాగుంటది

న్యూఢిల్లీ: కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై విప‌క్షాల విమ‌ర్శ‌లు పెరిగిపోతున్న వేళ‌... సొంత పార్టీ నేత‌ల నుంచి కూడా సెటైర్లు మొద‌ల‌య్యాయి. క‌శ్మీర్‌లో హిందువుల వ‌రుస హ‌త్య‌లు చోటుచేసుకుంటున్న వైనంపై బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కేంద్రం సర్కార్ పై విరుచుకుపడ్డారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆ ప‌నిలో విఫ‌ల‌మ‌య్యార‌ని, అందుకే ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి డిమాండ్ చేశారు. అమిత్ షా హోం శాఖ‌ను వ‌దిలేసి క్రీడ‌ల శాఖ‌ను చేప‌డితే బాగుంటుంద‌ని సెటైర్లు వేశారు. 

రాష్ట్రపతి పాల‌న అమ‌ల్లో ఉన్న‌ జమ్మూక‌శ్మీర్‌లో నిత్యం ఓ హిందువు హ‌త్య‌కు గుర‌వుతున్నార‌ని సుబ్రహ్మ‌ణ్య స్వామి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేయాల్సి వ‌స్తోంద‌ని ఆయ‌న అన్నారు. అమిత్ షాకు హోం శాఖ‌కు బ‌దులుగా క్రీడ‌ల శాఖ అయితే బాగుంటుంద‌న్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో క్రికెట్‌కు అన‌వ‌స‌ర ఆద‌ర‌ణ బాగా పెరిగింద‌ని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తల కోసం...

భారత సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తోంది..

రాహుల్ కు ఈడీ మరోసారి సమన్లు