Wedding Pics: హడావిడీ లేకుండా బీజేపీ ఎంపీ తేజస్వి వివాహం.. నాయకులు ఎవరెవరు అటెండ్ అయ్యారు?

Wedding Pics: హడావిడీ లేకుండా బీజేపీ ఎంపీ తేజస్వి వివాహం.. నాయకులు ఎవరెవరు అటెండ్ అయ్యారు?

బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య(Tejasvi Surya) కర్ణాటక గాయని శివశ్రీ స్కందప్రసాద్ను(Sivasri Skandaprasad) మ్యారేజ్ చేసుకున్నారు. నేడు (మార్చి 6న) బెంగళూరులో సాంప్రదాయ వేడుకలో ఎలాంటి హడావిడీ లేకుండా వీరి వివాహం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు మరియు ఎంపిక చేసిన రాజకీయ నాయకులు మాత్రమే ఈ సన్నిహిత వేడుకకు హాజరయ్యారు.

తేజస్వి సూర్య రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసాడు. భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడు. ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు అన్నామలై, ప్రతాప్ సింహా, అమిత్ మాలవ్య, బివై విజయేంద్ర మరియు కేంద్ర మంత్రి వి సోమన్న తదితర రాజకీయ నాయకులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

తేజస్వి సూర్య భారీ శివశ్రీ స్కంద బహుముఖ ప్రజ్ఞాశాలి. శాస్త్రీయ నృత్యం, భరతనాట్యం మరియు దృశ్య కళలలో ప్రావీణ్యం ఉంది. ఆమె గురువు ఎ.ఎస్. మురళి నుండి కర్ణాటక సంగీత శిక్షణ పొందింది. డెన్మార్క్ మరియు దక్షిణ కొరియాలో అంతర్జాతీయ వేదికలలో ప్రదర్శన ఇచ్చి తన ప్రతిభను చాటుకుంది.

ALSO READ | AnanyaPanday: మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అనన్య టాక్.. ధైర్యంగా ఎలా ఉండాలో తానే నేర్పింది

అంతేకాకుండా శివశ్రీ మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి భరతనాట్యంలో మాస్టర్స్ డిగ్రీని పొందింది. చెన్నై సంస్కృత కళాశాల నుంచి సంస్కృతంలో MA పట్టా పొందింది. దీనికి తోడు, ఆమె ఆయుర్వేద కాస్మోటాలజీలో డిప్లొమా చేసింది.