
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఓ ఇంటివాడయ్యారు. తమిళనాడుకు చెందిన సింగర్, భరతనాట్యం కళాకారిణితో వివాహం చేసుకున్నారు. గురువారం (మార్చి 6) బెంగళూరు కనకపుర రోడ్ లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తమిళనాడుకు చెందిన సింగర్, కళాకారిణి, ఆర్టిస్ట్ అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ తో తేజస్వీ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం వరపూజ కార్యక్రమం తర్వాత ప్రీ వెడ్డింగ్ తో వేడుకలు ప్రారంభించారు. సౌత్ ఇండియన్ సంప్రదాయంలో వివాహ వేడుకలు నిర్వహించారు.
ALSO READ | కేదార్నాథ్లో రెండు రోప్వేలు.. ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినకేంద్ర కేబినెట్
దక్షిణ భారత సంప్రదాయంలో భాగంగా కాశీ యాత్ర, జీరిగె బెల్ల ధారే (జీలకర్ర బెల్లం ధారణ), నిరీక్షణ ముహూర్త, మాంగళ్య ధారణ మొదలైన దక్షిణ సంప్రదాయంలో పెళ్లి వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత తేజస్వీ సూర్య కొత్తగా నిర్మించిన గృహ ప్రవేశ కార్యక్రమంతో కొత్త ఇంట్లోకి కొత్త దంపతులు ప్రవేశించారు.