అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా : రామారావ్​ పటేల్

కుంటాల, వెలుగు:  ఎన్నికల్లో తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని బీజేపీ ముథోల్ అభ్యర్థి పవార్​ రామారావ్​ పటేల్ చెప్పారు. మండలంలోని అంబుగాం, మెధన్​పూర్​, ఓల, లింబ(బి), పెంచికల్​పాడ్​ గ్రామాల్లో ఇంటింటా శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  తనకు ఓటువేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. 

బీఆర్​ఎస్​ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన,  సంక్షేమ పథకాలను  వివరించారు.  ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కార్యక్రమంలో  భైంసా ఏఎంసీ చైర్మన్​ రాజేశ్ బాబు, ఎంపీపీ  గజ్జారాం,  కట్ట రవి, అశోక్​కుమార్​, మోహన్​,  వెంగల్​రావ్​, నర్సయ్య, గజేందర్​, ప్రభాకర్​ తదితరులు పాల్గొన్నారు.