ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆర్మూర్, వెలుగు: ఉద్యమ పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ దుకాణం బంద్ అయ్యిందని, టీఆర్ఎస్ అంటేనే చీదరింపు రావడంతో దానిని బీఆర్ఎస్‌‌గా మార్చారని, పేరు మార్చుకున్నంత మాత్రాన జాతీయ పార్టీగా మారదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి అన్నారు. శనివారం ఆర్మూర్‌‌‌‌కు వచ్చిన ఆయనను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బీజేపీ ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నాయకులు కంచెట్టి గంగాధర్​, ఏలేటి మల్లికార్జున్‌‌రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ జెస్సు అనిల్ ఘనంగా సత్కరించారు. అనంతరం ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధిని గాలికి వదిలేసి రాజకీయాలు చేయడమే తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నారు. టీఆర్ఎస్ ఎన్ని పేర్లు మార్చుకున్న తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. సన్మినించిన వారిలో బీజేపీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, జిల్లా కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ నూతుల శ్రీనివాస్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆకుల రాజు, దుగ్గి విజయ్ ఉన్నారు.

కేంద్ర మంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే

కామారెడ్డి, వెలుగు: కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌‌‌‌రెడ్డి శనివారం హైదరాబాద్‌‌లో కలిశారు. తన బిడ్డ పెండ్లికి హాజరు కావాలని వారికి పెండ్లి పత్రికలు అందజేశారు. ఎంపీ లక్ష్మణ్‌‌ను కూడా కలిసి కార్డు అందజేశారు. ఆయన వెంట పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్​  వివేక్ వెంకటస్వామి, మురళీధర్‌‌‌‌గౌడ్ ఉన్నారు.  

ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడండి

నిజామాబాద్,  వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్ర జావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడాలని సీపీఐ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్  50 ఏళ్ల స్వర్ణోత్సవం సందర్భంగా శనివారం ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ నుంచి గాంధీ చౌక్, బస్టాండ్ మీదుగా కలెక్టర్ గ్రౌండ్ వరకు మహా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో పోటు రంగారావు హాజరై మాట్లాడారు. కేంద్రం బీడీ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల జీవితాన్ని చిన్నాభిన్నం చేసిందన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ల కు అప్పగించడం, ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరవడం కేంద్రానికి  సాధారణంగా మారిందన్నారు. ప్రత్యేక అతిథిగా వచ్చిన జర్నలిస్టు తులసి చందు మాట్లాడుతూ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై చిన్నచూపు చూస్తున్నాయన్నారు. బీడీ కార్మికు ల పిల్లల ఉన్నత విద్యకు ప్రభుత్వాలు చేయూత అందించాలన్నారు. సమావేశంలో ఐఎఫ్‌‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజన్న, పద్మ, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.రాజేశ్వర్, ఎం.వెంకన్న, ఐఎఫ్‌‌టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ముత్తెన్న, ఎం.సుధాకర్, రాష్ట్ర, జిల్లా నేతలు  పాల్గొన్నారు. 

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ చెల్లించాలి

కామారెడ్డి , వెలుగు: పెండింగ్‌‌‌‌ ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌,  స్కాలర్​షిప్‌‌‌‌లు​ చెల్లించాలని డిమాండ్​ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్‌‌‌‌ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో స్టూడెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం స్టేట్​ ప్రసిడెంట్ పర్లపల్లి రవీందర్, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎన్.బాలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.3,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ బకాయిలు ఉన్నాయన్నారు. హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు డి.జె శివ,  మనోహర్ పటేల్, నవీంద్ర చౌహన్ పాల్గొన్నారు.  

డాక్టర్లకు సన్మానం 

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్‌‌లోని గర్నమెంట్‌‌ హాస్పిటల్‌‌లో మెరుగైన సేవలందిస్తున్న డాక్టర్లను శనివారం హ్యాపీ వాకర్స్ అసోసియేషన్​ ఆధ్వర్యంలో సన్మానించారు. ఒక్క నెలలోనే 310 డెలివరీలు చేసి రికార్డు సృష్టించిన సూపరింటెండెండ్ బి.నాగరాజు, గైనకాలజిస్ట్ డాక్టర్లు అపర్ణ, గీత, హెడ్ నర్స్‌‌ రెబెకాను అభినందించి పూలమాల, శాలు వాతో సత్కరించారు. కార్యక్రమంలో హ్యాపీ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కొంగి మ నోహర్, డాక్టర్ ద్యావరశెట్టి శ్రీనివాస బాలు, దొండి జగదీశ్‌‌ వర్మ, మహేశ్‌‌, గంజి శేఖర్, ప్రభాకర్, శ్రీధర్, గడ్డి మోహన్ పాల్గొన్నారు.

పేకాడుతున్న11 మంది అరెస్ట్

నిజామాబాద్ క్రైమ్, వెలుగు:  సీపీ నాగరాజు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్‌‌స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామనగర్ కాలనీలో పేకాట స్థావరంపై దాడులు జరిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీ చేయగా పేకాట ఆడుతున్న అజ్మీర్ సురేశ్‌‌, గజవాడ సుధాకర్, పానుగంటి నరేశ్‌‌, జిట్ట రమేశ్‌‌, సంగ బాబు, హనుమాన్లు, దేగాం రమేశ్‌‌, గడ్డం కిషన్, పుల్లంగుల రాజలింగం, పద్మారావు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.24,990 నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఆర్మూర్ పోలీసులకు అప్పగించారు. 

కన్నాపూర్ వాసికి డాక్టరేట్​

లింగంపేట, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షుడు లింగంపేట మండలం కన్నాపూర్‌‌కు చెందిన నిజ్జన రమేశ్ పొలిటికల్ సైన్స్‌‌ విభాగంలో డాక్టరేట్​ సాదించారు. పొలిటికల్​ పార్టీస్​ అండ్ పీపుల్స్‌‌ మూమెంట్స్‌‌ ఇన్ తెలంగాణ రీసన్ ఏ స్టడీ ఆఫ్‌‌​ టీఆర్ఎస్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌‌ అనే అంశంపై  ప్రొఫెసర్ కోదండరాంరెడ్డి పర్యవేక్షణలో పరిశోధన చేయగా ఓయూ అధికారులు డాక్టరేట్‌‌ను ప్రకటించారు. డాక్టరేట్‌‌ సాధించిన రమేశ్​ గ్రామస్తులు అభినందించారు.

నిజామాబాద్‌‌ డీసీసీ ప్రెసిడెంట్‌‌గా మానాల

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్‌‌ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్‌‌గా మానాల మోహన్‌‌రెడ్డి రెండో సారి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ హైకమాండ్‌‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మోహన్‌‌ రెడ్డి మాట్లాడుతూ పార్టీ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, రాష్ట్రంలో బీఆర్ఎస్‌‌ మోసాలను ఎండగడతూ కాంగ్రెస్‌‌ అభివృద్ధికి కృషి చేస్తానని, కార్యర్తలకు అండగా ఉంటానని చెప్పారు.  

పీసీసీ వైస్ ప్రెసిడెంట్‌‌గా మదన్‌‌మోహన్‌‌రావు

కామారెడ్డి, వెలుగు: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్‌‌ గా కామారెడ్డి జిల్లాకు చెందిన కె.మదన్‌‌మోహన్‌‌రావు నియమితులయ్యారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే ఆదేశాల మేరకు పీపీసీ కమిటీని  ప్రకటించగా ఇందులో మదన్‌‌మోహన్‌‌రావుకు స్థానం దక్కింది. 

భిక్కనూరులో టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

భిక్కనూరు, వెలుగు: టీఆర్ఎస్ భిక్కనూరు మండల కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో శనివారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చీఫ్‌‌ గెస్ట్‌‌గా హాజరై మాట్లాడారు. కార్యకర్తలు బాగుంటేనే పార్టీ అభివృద్ధి చెందుతుందన్నారు. మొన్నటి వరకు టీఆర్‌‌‌‌ఎస్‌‌ ఆదరించిన లీడర్లు ఇప్పుడు బీఆర్ఎస్‌‌ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్‌‌​, ఎంపీపీ గాల్‌‌రెడ్డి, మాజీ ఎంపీపీ సుదర్శన్, జడ్పీటీసీ పద్మ నాగభూషణంగౌడ్, పట్టణ సర్పంచ్ తునికి వేణు, సర్పంచ్‌‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు నర్సింహులు యాదవ్ పాల్గొన్నారు. 

టీఎస్​ యూటీఎఫ్ జిల్లా కార్యవర్గం ఎన్నిక

ఆర్మూర్, వెలుగు: టీఎస్​యూటీఎఫ్ జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. టీఎస్​ యూటీఎఫ్ 5వ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి ఎ.వెంకట్ సమక్షంలో జరిగిన ఈ ఎన్నికలో అధ్యక్షుడిగా డి.సత్యానంద్, ప్రధాన కార్యదర్శిగా ఓ.రమేశ్‌‌, ఉపాధ్యక్షులుగా ఎం.డి సిరాజుద్దీన్, ఆర్.స్వర్ణలత, కోశాధికారిగా ఎం.మల్లేశ్‌‌, కార్యదర్శులుగా జి. గంగాధర్, ఎన్.రాజారామ్, వి.సాయన్న, జి.ఆనందం, పి.రమణ, ఎం.జనార్దన్, బి.ప్రేమలాల్, ఎం.పద్మావతి, ఆడిట్ కమిటీ కన్వీనర్‌‌‌‌గా డి.బాబును ఎన్నుకున్నారు. 

రాంప్రసాద్ ఇనానికి ఘన నివాళి 

పిట్లం, వెలుగు: మద్నూర్ అభివృద్దికి కృషి చేసిన దాత రాంప్రసాద్ ఇనాని జంయతిని మండల ప్రజలు ఘనంగా నిర్వహించారు. శనివారం మద్నూర్‌‌‌‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి రాంప్రసాద్‌‌ చేసిన సేవలను కొనియాడారు.  మద్నూర్‌‌‌‌లో జూనియర్​ కాలేజీ, 30 పడకల హాస్పిటల్, హైస్కూల్, రెసిడెన్సియల్ స్కూల్ కోసం దాదాపు 20 ఎకరాల భూములను  విరాళంగా ఇచ్చారని గుర్తు చేశారు. 

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ చెల్లించాలి

కామారెడ్డి , వెలుగు: పెండింగ్‌‌‌‌ ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌,  స్కాలర్​షిప్‌‌‌‌లు​ చెల్లించాలని డిమాండ్​ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్‌‌‌‌ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో స్టూడెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం స్టేట్​ ప్రసిడెంట్ పర్లపల్లి రవీందర్, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎన్.బాలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.3,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ బకాయిలు ఉన్నాయన్నారు. హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు డి.జె శివ,  మనోహర్ పటేల్, నవీంద్ర చౌహన్ పాల్గొన్నారు.  

మూడు నెలలైనా శ్రీకాంత్‌ ఆచూకీ కనుక్కోరా?

బోధన్, వెలుగు: ఖండ్‌గామ్‌కు చెందిన శ్రీకాంత్‌ మూడు నెలలుగా కనిపించకుండా పోవడంతో అతడి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండాల లక్ష్మీనారాయణ, కార్యదర్శి పటేల్​ప్రసాద్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గ్రామానికి చెందిన లక్ష్మణ్ పటేల్ కుమారుడు శ్రీకాంత్ బోధన్‌‌లోని ప్రైవేట్‌‌ డీగ్రీ కాలేజీకి వెళ్లి మూడు నెలల నుంచి కనిపించకుండా పోయాడని తెలిపారు. కుటుంబ సభ్యులు రూరల్​ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు కూడా చేశారని పేర్కొన్నారు. మిస్సింగ్ కేసును నమోదై మూడు నెలలు అవుతున్నా పోలీసులు ఇంతవరకు ఆచూకీ కనుక్కోలేదన్నా రు. బాధితుడి తండ్రి లక్ష్మణ్ పటేల్‌‌కు ఏసీపీ దురు సుగా సమాధానం చెప్పడం సరికాదన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎం.పోశెట్టి,  జిల్లా కార్యవర్గ సభ్యులు అశోక్‌‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, ఎస్సీ మెర్చా అధ్యక్షుడు నర్సింలు, నాయకులు విఠల్​ పటేల్, బాబు, విజయ్‌‌ కుమార్, సాయి కుమార్, భాస్కర్ పాల్గొన్నారు. 

కొనసాగుతున్న పోలీస్ రిక్రూట్‌‌మెంట్

నగర శివారులోని రాజారాం స్టేడియంలో నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ పరీక్షలు మూడో రోజూ కొనసాగాయి. శుక్రవారం పోలీసు కమిషనర్ నాగరాజు సమక్షంలో మహిళా అభ్యర్థులకు రన్నింగ్‌‌‌‌, లాంగ్‌‌‌‌ జంప్‌‌‌‌, షాట్‌‌‌‌పుట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లు నిర్వహించారు. వెయ్యి మంది మహిళా అభ్యర్థులకు ఎంపికకు పిలువుగా 879 మంది హాజరయ్యారు. ఏక్కడ కూడా మానవ ప్రమేయం లేకుండా, అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికలో ఈవెంట్స్ నిర్వహిస్తున్నామని సీపీ తెలిపారు.

- వెలుగు, నిజామాబాద్ క్రైమ్