మంచిర్యాల: భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల మైన్ లో 20వేల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి ఏరియా కేకే 5 గని పై జరిగిన బీఎమ్ఎస్ సింగరేణి కార్మిక చైతన్య యాత్ర గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి... తాడిచర్ల మైన్ లో జరిగిన అవినీతిలో కేసీఆర్ కు వాటా ఉందని, దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్న సమయంలో కొందరు టీబీజీకేఎస్ నాయకులు మీటింగ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బీఎమ్ఎస్, టీబీజీకేఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం వివేక్ వెంకటస్వామి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
టీబీజీకేఎస్ నాయకులు మీటింగ్ ను అడ్డుకోవడం సరికాదని వివేక్ వెంకటస్వామి అన్నారు. నిజానికి టీబీజీకేఎస్ నాయకులకు మీటింగ్ ను అడ్డుకోవాలనే ఆలోచన లేదని... బాల్క సుమన్ చెప్పడంతో తప్పదని వచ్చారన్నారు. బీఎమ్ఎస్ నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా టీబీజీకేఎస్ నాయకులు పారిపోయారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలతో పాటు.. ప్రతిపక్ష యూనియన్లను కూడా లేకుండా చేయాలని చూస్తోందని మండిపడ్డారు.
మరిన్ని వార్తల కోసం...