తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది :తరుణ్ చుగ్

తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది :తరుణ్ చుగ్
  •     5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోయింది: చుగ్
  •     ఢిల్లీలో తరుణ్​ చుగ్‌‌తో బండి సంజయ్ భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే విషయం ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో రుజువైందన్నారు. శుక్రవారం ఢిల్లీ సౌత్ ఎవెన్యూలోని తరుణ్ చుగ్ నివాసంలో ఆయనను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలిశారు. 

ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించినట్లు చుగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. సాధ్యంకాని హమీలిచ్చి.. వాటిని అమలు చేయకుండా ప్రజలకు ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు, సంజయ్‌‌ను పలువురు నేతలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.