బీఆర్ఎస్ ది బెలూన్ల రాజకీయం..పొంగులేటి సుధాకర్ రెడ్డి

కల్లూరు, వెలుగు:  దేశంలో అధికారంలోకి వస్తామంటూ కాంగ్రెస్ పార్టీ గాలి మేడలు కడుతుంటే, తెలంగాణలో  బీఆర్ఎస్ పార్టీ బెలూన్ల రాజకీయం చేస్తోందని బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. మేరా బూత్ సబ్ సే మహాబూత్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని నారాయణపురం గ్రామంలోని స్వగృహంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  తొమ్మిది సంవత్సరాల కాలంలో  చేసిన అభివృద్ధిని ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ  వివరిస్తున్నామన్నారు.   

సోషల్ మీడియాలో సొంత బూస్టింగ్ చేసుకుంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు   బృందగానం  చేస్తున్నాయని ఆరోపించారు.  కమ్యూనిస్టు పార్టీలు కేసుల మాఫీ కోసం,  టికెట్ల కోసం కేసీఆర్ దగ్గర పాకులాడుతున్నారని విమర్శించారు.  పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను, రైతులను  సత్కరించారు.  కార్యక్రమంలో  నంబూరి రామలింగేశ్వరరావు,  దార్ల శంకర్ గౌడ్,  గుమ్మ రామకృష్ణ,  ఉపసర్పంచ్ కోటపాటి శివాజీ , ఆనంగి నరసింహారావు, వెంకటేశ్వరరావు  నాయకులు, కార్యకర్తలు
 పాల్గొన్నారు.