![బండి సంజయ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఫోన్](https://static.v6velugu.com/uploads/2022/01/BJP-national-president-JP-Nadda-called-phone-to-Bandi-Sanjay..Assuring-that-the-BJP-national-leadership-will-always-be-with-you_wkPF1u5YC3.jpg)
- కేసుల గురించి డోంట్ వర్రీ.. న్యాయస్థానంలో మేం పోరాడతాం
- బీజేపీ జాతీయ నాయకత్వం యావత్తు మీ వెంట ఉంటుంది
- బండి సంజయ్ కు ఫోన్ చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేస్తున్న పోరాటం బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్లింది. పోలీసులు దురుసుగా ప్రవర్తించి అక్రమంగా అరెస్టు చేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్ది సేపటి క్రితం బండి సంజయ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఫోన్ చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్నారని నడ్డాకు తెలిపారు బండి సంజయ్ కార్యాలయ సిబ్బంది.
దీంతో వెంటనే స్పందించిన జేపీ నడ్డా ‘‘సంజయ్ జీకి నా మాటగా చెప్పండి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన సంజయ్ జీ చేస్తున్న పోరాటం భేష్.. కేసుల విషయంలో ఏం వర్రీ కావొద్దు.. మేం చూసుకుంటాం.. న్యాయ స్థానంలో మేం పోరాడతాం.. జాతీయ నాయకత్వం యావత్తు సంజయ్ జీ వెంట ఉంది. గో...హెడ్’’ అని భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
స్టేషన్ లో రాత్రంత దీక్ష చేసిన బండి సంజయ్
మీ పాన్ కార్డు అసలైందేనా ? తెలుసుకోండి ఇలా..
బండ్లు, కార్ల అమ్మకాల్లో జోష్.. రాష్ట్రంలో కోటిన్నరకు చేరువైన వెహికల్స్