ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

గద్వాల, వెలుగు: కల్వకుంట్ల ఫ్యామిలీ జూటా మాటలకు కేరాఫ్ అడ్రస్‌‌‌‌గా మారిందని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ విమర్శించారు.  శనివారం గద్వాల టౌన్‌‌‌‌లోని ఎస్వీ ఈవెంట్ హాల్‌‌‌‌లో 119 నియోజకవర్గాల బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ కోసం పనిచేస్తుంటే.. ప్రధాని మోడీ దేశం కోసం పని చేస్తున్నారని స్పష్టం చేశారు.  మోడీ ఉండడం వల్లే భారత్‌‌‌‌ను ప్రపంచ దేశాలు బలమైన శక్తిగా చూస్తున్నాయన్నారు. కార్యకర్తలు బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ హామీ ఇచ్చి మరిచిన నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్‌‌‌‌ ఇండ్లు, రుణమాఫీ,  దళితులకు మూడెకరాల గురించి ప్రజలకు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇన్‌‌‌‌చార్జి వెంకటరెడ్డి, సమ్మేళనం ఇన్‌‌‌‌చార్జి కృష్ణ,  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి డికె స్నిగ్ధా రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు పాల్గొన్నారు.

‌‌‌‌‌‌‌‌గడీల పాలనకు చరమగీతం పాడాలి

వనపర్తి, అమనగల్లు, అచ్చంపేట, కందనూలు, కోస్గి టౌన్, వెలుగు:  రాష్ట్రంలో గడీల పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్సీ రామచందర్​రావు, జాతీయ కమిషన్ మాజీ ​సభ్యులు రాములు, ఆచారి పిలుపునిచ్చారు. శనివారం ఆమనగల్లు మండలం మేడిగడ్డ తండా వద్ద  ఫంక్షన్​ హాల్‌‌‌‌లో జరిగిన కల్వకుర్తి నియోజకవర్గ స్థాయి బీజేపీ బూత్​కమిటీ సమ్మేళనానికి వారు చీఫ్‌‌‌‌గెస్ట్‌‌‌‌గా హాజరయ్యారు. అంతకుముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డ ప్రారంభించిన సరళ్​యాప్‌‌‌‌ను వర్చువల్​ ద్వారా వీక్షించారు.  ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ  కార్యకర్తలు, నాయకులు మిషన్ 90 లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.  వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు  ఏ.రాజవర్ధన్ రెడ్డి,  అసెంబ్లీ పాలక్ బుక్కా వేణుగోపాల్,  కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్,  జిల్లా ఇన్‌‌‌‌చార్జి బోసుపల్లి ప్రతాప్, అచ్చంపేటలో నిర్వహించిన మీటింగ్‌‌‌‌లో అసెంబ్లీ పాలక్​అందె బాబయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి ,  రాష్ట్ర నేతలు సుధాకర్​ రెడ్డి,  సతీశ్ మాదిగ, శ్రీకాంత్​ భీమా,  బిజినేపల్లి మండలం పాలెంలో నిర్వహించిన మీటింగ్‌‌‌‌లో మాజీ మంత్రి పి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ వర్దన్ రెడ్డి ,  అసెంబ్లీ ఇన్‌‌‌‌చార్జి దిలిపా చారి,  కోస్గిలో జిల్లా మేధావుల ఫోరం కన్వీనర్ ఇప్పటూరి బాలనర్సయ్య, నియోజకవర్గ కోకన్వీనర్ కోటకొండ రాము పాల్గొన్నారు.  


టాలెంట్ టెస్టులతో నైపుణ్యం పెరుగుతుంది

గద్వాల టౌన్, వెలుగు: టాలెంట్ టెస్టులతో  స్టూడెంట్లలో నైపుణ్యం పెరుగుతుందని నడిగడ్డ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు పాల్వాయి లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్ లో సాంఘిక శాస్త్ర టీచర్ల జిల్లా ఫోరం, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞన్ ప్రతిష్ట సౌజన్యంతో టెన్త్  విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.  తెలుగు మీడియంలో రాము , మహబూబ్ పాషా, సింధు,  ఇంగ్లీష్ మీడియంలో శ్రావణి, అనిల్, నందిని ఫస్ట్‌‌‌‌, సెకండ్, థర్డ్ ప్రైజ్‌‌‌‌లు గెలుచుకున్నారు.  ప్రైవేట్ స్కూళ్ల విభాగంలో శశిధర్ , శిరీష ఫస్ట్‌‌‌‌, సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం విష్ణు, కొండాపురం ప్రతాప్    తదితరులు 
ఉన్నారు.

వ్యవసాయ శాఖ పనితీరు బాగుంది: కలెక్టర్​వెంకట్‌‌‌‌రావు

మహబూబ్​నగర్, వెలుగు: జిల్లాలో వ్యవసాయ శాఖ పనితీరు బాగుందని కలెక్టర్​వెంకట్‌‌‌‌రావు అభినందించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌లో​  వ్యవసాయ  అధికారుల సంఘం డైరీ,  క్యాలెండర్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు కొత్తటెక్నాలజీని పరిచయం చేస్తూ దిగుబడులు పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణకిషోర్,  చైర్మన్​ యశ్వంత్​రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కృపాకర్​రెడ్డి, కొమురయ్య, సభ్యులు హైమావతి, మాధవి, రాజేందర్​రెడ్డి, ఏవోలు అజయ్​కుమార్, ప్రత్యూష, శ్రుతి, ప్రవీణ, రేవతి పాల్గొన్నారు.

బండలాగుడు పోటీలు అడ్డుకున్న పోలీసులు

ఆగ్రహం వ్యక్తం చేసిన డీకే అరుణ, భరత సింహారెడ్డి
 అనుమతి లేదన్న గద్వాల సీఐ చంద్రశేఖర్

గద్వాల, వెలుగు: గట్టు మండలం ఆలూరులో నిర్వహిస్తున్న బండలాగు పోటీలను పోలీసులు అడ్డుకున్నారు.  గ్రామస్తుల వివరాల ప్రకారం..  గ్రామంలో గోకర్‌‌‌‌‌‌‌‌మయ్యాజాతర సందర్భంగా బీజేపీ  ఆధ్వర్యంలో బండలాగు పోటీలను ఏర్పాటు చేశారు.  పర్మిషన్ కోసం పోలీసులకు దరఖాస్తు  చేసుకోగా.. పోటీలు నిర్వహించే స్థలం వివాదంలో ఉందని చెప్పారు.  తాము ఎలాంటి నిర్మాణాలు చేయడం లేదని, కేవలం పోటీలు మాత్రమే నిర్వహిస్తామని చెప్పి పార్టీ నేతలు తిరిగి వచ్చారు. శనివారం పోటీలు ఉంటాయని ముందే చెప్పడంతో పాల్గొనేందుకు 16 జతల ఎద్దులు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే డీకే భరత సింహారెడ్డి ప్రారంభించేందుకు వెళ్లగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు పోటీలను అడ్డకున్నారు.  కేసులు పెడతామని ఎద్దుల యజమానులను హెచ్చరించడంతో వారు వెకకడుగు వేశారు. ఈ క్రమంలో  భరత సింహారెడ్డి  గట్టు ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీ నేతలను ఒకలాగా, ప్రతిపక్షాలను ఒకలాగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరగబడితే ఊళ్లలో అడుగుపెట్టలేరు

విషయం తెలుసుకున్న బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ  పోలీసులు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు జీతగాళ్లలా మారిపోయారని,  ప్రజలు  తిరగబడితే ఊళ్లలో కాలు కూడా పెట్టలేరంటూ విరుచుకుపడ్డారు.  జీతాలు ఇస్తుంది కేసీఆర్, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ కాదని ప్రజలు ఇస్తున్నారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. యూనిఫామ్స్‌‌‌‌ వేసుకొని రౌడీల్లా  వ్యవహరిస్తే  ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంపై గద్వాల సీఐ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ను వివరణ కోరగా.. పోటీలు నిర్వహించే స్థలంపై కోర్టు కేసు ఉన్నందునే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. 


న్యాయం చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తాం

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు:ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల మార్కులకు సంబంధించి  హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను  అమలు చేయకపోతే  ప్రగతి భవన్ ముట్టడిస్తామని స్టూడెంట్స్ సంఘాల నాయకులు హెచ్చరించారు.  శనివారం కలెక్టరేట్ ఏవో శంకర్‌‌‌‌కు వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్‌‌‌‌కు సంబంధించి 7 మార్కులు కలపాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో వేల మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు.  అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా లాంగ్‌‌‌‌ జంప్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌ పెంచి ఇబ్బందులు పెట్టారని వాపోయారు.  వినతి పత్రం అందజేసిన వారిలో స్టూడెంట్స్ సంఘాల నాయకులు రాజు, ప్రశాంత్, సీతారామ్‌‌‌‌ ఉన్నారు.  

ధరణి సమస్యలు పరిష్కరించాలి: అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్ 


గద్వాల, వెలుగు: పెండింగ్‌‌‌‌లో ఉన్న ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలని  అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్  ఆదేశించారు. శనివారం  కల్లెక్టరేట్ మీటింగ్ హాల్‌‌‌‌లో తహసీల్దార్లతో సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌‌‌‌లో పెండింగ్‌‌‌‌ అప్లికేషన్లపై మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  టీఎం33, జీఎల్ఎం సమస్యలపై స్పెషల్ ఫోకస్‌‌‌‌ పెట్టాలని సూచించారు.  మెగా పల్లె ప్రకృతి వనాల కోసం స్థలాల గుర్తింపు, ఏర్పాటుపై రిపోర్ట్ ఇవ్వాలని  ఆదేశించారు.   


ప్రతి వ్యక్తికి ఫిజికల్ ఎడ్యుకేషన్‌‌‌‌ అవసరం:ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్  

మహబూబ్ నగర్ రూరల్/టౌన్‌‌‌‌,  వెలుగు:  ప్రతి వ్యక్తికి  ఫిజికల్ ఎడ్యుకేషన్‌‌‌‌ అవసరమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. పీయూలో ఫిజికల్ ఎడ్యూకేషన్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌‌‌‌ ఆన్ రిసెంట్ అడ్వాన్సెస్  సైన్స్‌‌‌‌ –2022 సదస్సుకు  శనివారం చీఫ్ గెస్ట్‌‌‌‌గా హాజరై మాట్లాడారు. మారిన జీవన విధానంతో వస్తున్న రోగాలను నియంత్రించాలంటే  ప్రతి ఒక్కరూ  ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌పై దృష్టి పెట్టాలన్నారు. శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసికంగా బలంగా ఉంటామన్నారు. అనంతరం పీయూలో 500  కేఎల్‌‌‌‌ సామర్థ్యంతో  నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్ పనులకు భూమిపూజ చేశారు. సదస్సుకు వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంథ్  రాథోడ్‌‌‌‌, మలేషియా వర్సిటీ ప్రొఫెసర్ లింబ్ బూన్ హుయ్, మాజీ స్పోర్ట్స్ డైరెక్టర్ నీరజ్ జైన్, ఎంజీ వర్సిటీ  వైస్‌‌‌‌ చాన్స్‌‌‌‌లర్ ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్ రెడ్డి, ఏపీ మాజీ  ఫిజికల్ ఎడ్యుకేషన్ టెక్నికల్ అడ్వైజర్  చిన్నపరెడ్డి, ఏఐయూ ఫార్మర్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ గురుదీప్ సింగ్ , ద్రోణాచార్య అవార్డు గ్రహీత   రమేశ్, పీయూ రిజిస్ట్రార్  గిరిజా మంగతాయారు హాజరయ్యారు.    
అన్ని హంగులతో ఎస్పీ ఆఫీస్‌‌‌‌   
కొత్త కలెక్టరేట్ మాదిరిగానే  అన్ని హంగులతో కొత్త ఎస్పీ ఆఫీసును నిర్మిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌‌లో కొత్తగా నిర్మించిన పోర్టువాల్‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రం ఏర్పాటయ్యాక  నేరాలు అదుపులో ఉన్నాయని, పోలీస్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ 24 గంటలు పనిచేస్తూ ఇతర రాష్ట్రాలకు  ఆదర్శంగా నిలిస్తోందని అభినందించారు.  అనంతరం  మన్యంకొండ టెంపుల్‌‌‌‌ వద్ద జరుగుతున్న  పనులను పరిశీలించారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరగా కంప్లీట్ చేయాలని అధికారులను ఆదేశించారు.   కలెక్టర్ వెంకటరావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహేశ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న,  గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, పీఆర్‌‌‌‌‌‌‌‌ ఈఈ నరేందర్   పాల్గొన్నారు. 

పోడు రైతులందరికీ హక్కు పత్రాలివ్వాలి
    గిరిజన సంఘం 
రాష్ట్ర అధ్యక్షుడు ధర్మనాయక్ 
అమ్రాబాద్, వెలుగు: దరఖాస్తులు పెట్టుకున్న పోడు రైతులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మనాయక్  డిమాండ్ చేశారు. శనివారం ఐటీడీఏ అధికారి జాఫర్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నాగర్ కర్నూల్ జిల్లాలోని 12,500 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 375 మందిని అర్హులుగా గుర్తించి 666 ఎకరాలకు హక్కు పత్రాలు ఇవ్వడం సరికాదన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం  గిరిజనులు భూములు తీసుకుంటున్న సర్కారు.. ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములపై హక్కులు ఎందుకివ్వదని నిలదీశారు.  గ్రామాల్లో ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌సీ కమిటీ సమావేశాలు పెట్టకుండానే హక్కు పత్రాలు ఫైనల్ చేయడం సరికాదన్నారు.  గ్రామసభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్,  గిరిజన సంఘం పదర మండల అధ్యక్షుడు ఆర్ దగ్న నాయక్ పాల్గొన్నారు.


పైపులైన్​ పనులు ఆపాలి

    ధర్నాకు దిగిన రైతులు
మరికల్, వెలుగు: ఇథనాల్ కంపెనీ నీటి అవసరాల కోసం కోయిల్​సాగర్​ కాలువ పక్క నుంచి  వేస్తున్న పైపులైన్​ పనులను ఆపాలని చిత్తనూర్​, ఎక్లాస్​పూర్, రాంపూర్​, జిన్నారం గ్రామ రైతులు డిమాండ్ చేశారు. శనివారం పనులను అడ్డుకొని ధర్నాకు దిగారు.  సమాచారం అందుకున్న పోలీసులు వారిని చెదగొట్టారు. ఈ క్రమంలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం రైతులు ఎక్లాస్​పూర్​స్టేజీ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటలు పండిచుకునేందుకు తాము వేసుకున్న పైపులు ధ్వంసం చేసి పైప్‌‌‌‌లైన్‌‌‌‌ వేస్తున్నారని ఆరోపించారు. దీంతో తాము వారం కింద పనులు అడ్డుకుంటే కేసులు పెట్టారని మండిపడ్డారు. ఆరు నెలల నుంచి ఆందోళనలు చేస్తున్నా అధికారులు, కంపెనీ పట్టించుకోవడం లేదని వాపోయారు.  అధికారులు వచ్చి స్పష్టమైన హమీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న మానవ హక్కుల వేదిక నేతలు రైతులకు మద్దతుగా నిలిచారు.  కంపెనీ రైతులపై కేసులుపెట్టి బెదిరింపులకు దిగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ రాంకోటి  అక్కడికి చేరుకొని  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషిచేస్తానని హమీ ఇచ్చారు.

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో 
కుమ్ములాటలు
    ఎంపీపీ ఇంటిపైకి వెళ్లిన 
మాజీ సర్పంచ్ వర్గీయులు
గద్వాల, వెలుగు: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్‌‌‌‌ పార్టీలో కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. శుక్రవారం  ధరూర్ మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, ధరూర్ ఎంపీపీ తమ్ముడు జాకీర్ వర్గీయుడు దేవదాస్‌‌‌‌ కొట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా శనివారం మాజీ సర్పంచ్ వర్గీయులు ఎంపీపీ తమ్ముడి ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తోసుకున్నారు.  ఎవరికి మద్దతిస్తే ఏం జరుగుతుందోనని పార్టీ నేతలు కూడా గమ్మునున్నారు.