అన్ని వర్గాలకు ఉపయోగపడేలా బీజేపీ మేనిఫెస్టో : వివేక్​ వెంకటస్వామి

 వెల్గటూర్, వెలుగు: తెలంగాణలో అన్ని వర్గాలకు ఉపయోగపడేలా బీజేపీ మేనిఫెస్టో తయారవుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చెప్పారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి ఎస్‌‌హెచ్​గార్డెన్ లో ధర్మపురి నియోజకర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మహారాష్ట్ర మాజీ మంత్రి, జిల్లా ఇన్‌‌చార్జి రామ్ కుమార్ షిండేతో కలిసి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ వచ్చే 50 రోజులు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పని చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని దానికి అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు.

కార్యక్రమం లో పార్టీ జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ రావు, రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ కస్తూరి సత్యం, గాజుల మల్లేశం, చంద్ర శేఖర్, మంచె రాజేశ్‌‌, పిల్లి శ్రీనివాస్, మర్రిపెళ్లి సత్యం, మండల అధ్యక్షులు చక్రపాణి, కొమురెల్లి, కట్ట మహేశ్‌‌, గంగారం, శ్రీధర్, వేణుగోపాల్ రెడ్డి, ఎన్ఆర్ఐ ఫౌండర్ ప్రవీణ్ యాదవ్, రాజేశం, భాస్కర్, లవణ్ పాల్గొన్నారు.