సీఎం కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ కోతల మాటలు తెలంగాణ ప్రజలకు కొత్తేం కాదన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికలప్పుడు ఎన్నో అబద్ధాలు చెప్పారని..ఇప్పుడు కూడా అవే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. టీఆర్ ఎస్ పాలనలో తెలంగాణలో ఏ వర్గానికి సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ చెప్పే అబద్ధాల మాటలు విని ప్రజలు విసిగిపోయారన్నారు. టీఆర్ఎస్ ను ఓడించేందుకు టైం దగ్గర పడిందని అందరూ అనుకుంటున్నారని చెప్పారు వివేక్ వెంకటస్వామి.
నీ కోతల మాటలు తెలంగాణ ప్రజలకు కొత్తేం కాదు KCR..ఎన్నికలప్పుడు ఎన్నో అబద్ధాలు చెప్పావ్..
— Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) March 16, 2022
ఇప్పుడు అవే అబద్ధాలు చెప్తున్నవ్.
తెలంగాణ లోని ఏ వర్గానికి కూడా సరైన న్యాయం చేయలేకపోయావ్.అసెంబ్లీలోనీ అబద్దాల మాటలు విని ప్రజలు నీ టైం దగ్గర పడిందని అనుకుంటున్నారు KCR #KCRFailedTelangana pic.twitter.com/qjP9rwrTmP
మరిన్ని వార్తల కోసం
అబద్ధాలు చెప్పుడు.. ఆస్తులు పెంచుకునుడే కేసీఆర్ పని
గాంధీ ఆస్పత్రిలో నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్లు