నిజామాబాద్​ బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ గా రాజ్ కుమార్ : యామాది భాస్కర్

నిజామాబాద్ సిటీ, వెలుగు: బీజేపీ ఓబీసీ మోర్చా అర్బన్ అసెంబ్లీ ఐటీ సెల్ కన్వీనర్ గా అట్కూరి రాజ్ కుమార్,   కంఠేశ్వర్ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా మారెడ్డి సురేశ్​ను నియమిస్తూ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు యామాది భాస్కర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోడూరు నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ ఎం. నవీన్ కుమార్, ఓబీసీ మోర్చా అర్బన్ అసెంబ్లీ కన్వీనర్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.