బీజేపీ కార్యకర్తలు అమ్ముడుపోరు : రాణిరుద్రమ

ఎల్లారెడ్డిపేట,వెలుగు: బీజేపీ కార్యకర్తలకు అధికార పార్టీకి నాయకులు ప్రలోభపెడితే అమ్ముడుపోరని సిరిసిల్ల బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. గురువారం ఆమె ఎల్లారెడిపేట మండల కేంద్రంలో బీజేపీ   కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా రాణి రుద్రమ మాట్లాడుతూ బీఆర్​ఎస్ నాయకులు బీజేపీ నాయకులను ప్రలోభ పెడుతున్నారన్నారు. మీరు ఎంత డబ్బు ఆశ చూసిన బీజేపీ నాయకులు వారి సిద్దాంతాలను మార్చుకోరన్నారు. బీజేపీ కార్యకర్తలను వేధిస్తే  ఊరుకోబోమన్నారు. .సిరిసిల్లలో గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు.ఆమె వెంట బీజేపీ జిల్లా ఇన్​చార్జి గంగాడిమోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి,  నియోజక వర్గ అసెంబ్లీ ఇంచార్జ్ మల్లారెడ్డి,సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడేపు రవీందర్,మండల అద్యక్షుడు తిరుపతిరెడ్డి,నేవూరి దేవేందర్ రెడ్డి, సత్యంరెడ్డి పాల్గోన్నారు.