ఢీల్లీలో ఆప్, కాంగ్రెస్ పార్టీలే బీజేపీని గెలిపించాయా..?

 ఢీల్లీలో ఆప్, కాంగ్రెస్ పార్టీలే బీజేపీని గెలిపించాయా..?

ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. వరుసగా రెండు దఫాలుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఓడించింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది బీజేపీ. 

ఢిల్లీ ఓటమిపై కాంగ్రెస్, ఆప్ ఒకరినొకరు నిందించుకుంటున్నాయి. కేజ్రీవాల్ అతి విశ్వాసం వల్లనే ఢిల్లీలో బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఓట్లు కలిసి ఉంటే ఆప్ గెలిచేదని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. 

అయితే ఢిల్లీ ఓటమికి ఇరు పార్టీల తప్పిదం ఉందని చెప్పకతప్పదు. ఇండియా కూటమి ఓట్ల చీలిక తోనే బీజేపీకి గెలుపు సులువైందనేది బహిరంగ సత్యం. సీట్ల పంపకాల్లో కుదరని సయోధ్యతో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. 

కాంగ్రెస్ అడిగినన్ని స్థానాలు ఆప్ ఇవ్వక పోవడం.. దీంతొ చెరో దారి చూసుకొని కూటమి నిబంధనలకు బ్రేక్ వేశాయి రెండు పార్టీలు. 

Also Read :- ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ లైవ్ అప్డేట్స్

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కు కలిపి దాదాపు  50 శాతం ఓట్ షేరింగ్ ఉండగా.. అందులో దాదాపు ఆప్ కు  43 శాతం, కాంగ్రెస్ 7 శాతానికి పైగా ఓట్ షేరింగ్ ఉంది. అంటే 50 శాతం ఓట్ షేరింగ్ ఉన్న ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం ఢిల్లీకి కలిసి వచ్చింది. 

బీజేపీ 46.3 శాతం ఓట్ షేరింగ్ తో ఢిల్లీ పీఠంలో గెలుపొందింది. అంటే ఆప్, కాంగ్రెస్ ఓట్లు కలుపుకుంటే బీజేపీని ఓడించడం తేలికయ్యేది. కానీ ఆప్ అతి విశ్వాసం, కాంగ్రెస్ అడ్జస్ట్ కాలేకపోవడం ఢిల్లీలో కొంప ముంచిందని చెప్పవచ్చు. రెండు పార్టీల ఓట్లు చీలడంతో బీజేపీ గెలుపు సులువైంది. 

దీనిపై కూటమి నేత ఒమర్ అబ్దుల్లా బహిరంగంగానే విమర్శించారు. మనం తగవులాడుకుంటే మూడో వారికి లాభం అన్నట్లుగా ఆప్, కాంగ్రెస్ విభేదాల కారణంగా బేజేపీకి గెలుపు కలిసొచ్చిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు.