మునుగోడు ఓటర్ల నమోదుపై హైకోర్టులో బీజేపీ పిటిషన్ డిస్మిస్ ​

హైదరాబాద్, వెలుగు: మునుగోడులో కొత్త ఓటర్ల నమోదు వ్యవహారంపై హైకోర్టు విచారణ ముగిసింది. పక్క ప్రాంతాలకు చెందిన 25 వేల మందిని మునుగోడు ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి వేసిన పిటిషన్‌‌‌‌పై చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌ భాస్కర్‌‌‌‌రెడ్డి బెంచ్‌‌‌‌ శుక్రవారం విచారించింది. మునుగోడులో జనవరి 5న 2,27,101 ఓట్లుంటే..  ఈ నెల 14 నాటికి 2,41,805కు పెరిగాయని ఈసీ తరఫు అడ్వకేట్ అవినాశ్ దేశాయ్‌‌‌‌ కోర్టుకు వివరించారు.

ఎన్నికలపుడు  కొత్త ఓటర్ల నమోదుకావడం, ఈ మాత్రం ఓటర్ల సంఖ్య పెరగడం సాధారణమేనని తెలిపారు. దీంతో ఈ కేసులో ఎవరికీ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్​ను డిస్మిస్​ చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.