ఢిల్లీలో ఆలయాలు కూల్చాలని ఎల్జీ​ ఆదేశించారు : ఢిల్లీ సీఎం ఆతిశి

ఢిల్లీలో ఆలయాలు కూల్చాలని ఎల్జీ​ ఆదేశించారు : ఢిల్లీ సీఎం ఆతిశి
  • నా దగ్గర డాక్యుమెంటరీ ప్రూఫ్​ ఉన్నది

న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని బౌద్ధ ప్రార్థనా స్థలాలతోపాటు పలు హిందూ ఆలయాలను కూల్చేయాలని లెఫ్టినెంట్​ గవర్నర్​ వీకే సక్సేనా ఆదేశించారని ఢిల్లీ సీఎం ఆతిశి పునరుద్ఘాటించారు. ఇంతకు సంబంధించి తన దగ్గర డాక్యుమెంటరీ ప్రూఫ్​ ఉన్నదని చెప్పారు. తాను అలాంటి ఆదేశాలేమీ ఇవ్వలేదని, ఢిల్లీ సీఎం డర్టీ పాలిటిక్స్​ చేస్తున్నారని ఎల్​జీ సక్సేనా చేసిన వ్యాఖ్యలపై బుధవారం ఆతిశి స్పందించారు. వివిధ ప్రాంతాల్లోని బౌద్ధారామాలతో సహా అనేక దేవాలయాలు, ఇతర నిర్మాణాలను కూల్చివేసేందుకు కేంద్ర సర్కారు యోచిస్తున్నదని ఆరోపించారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకున్నదని, డీడీఏ, ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీచేసే బాధ్యతలను ఎల్​జీకి అప్పగించిందని అన్నారు. 

ఎల్జీ అబద్ధాలు చెబుతున్నరు

ఆలయాల కూల్చివేత ఆర్డర్స్​పై ఎల్జీ సక్సేనా  అబద్ధాలు చెబుతున్నారని ఆతిశి ఆరోపించారు. ‘‘నవంబర్​ 22న మతపరమైన కమిటీ మీటింగ్​ జరిగింది. ఆ సమావేశానికి సంబంధించిన మినిట్స్​ ఇవే. నిన్న నేను ఎల్​జీకి లేఖ రాసినప్పుడు.. ఆలయాలను కూల్చివేసే నిర్ణయమేదీ తీసుకోలేదని ఆయన కార్యాలయం చాలా మీడియా సంస్థలకు తెలిపింది. ఇది పూర్తిగా అబద్ధం” అని పేర్కొన్నారు. మీటింగ్​ మినిట్స్​ను మీడియాకు చూపించారు. ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే ఈ డాక్యుమెంటరీ ప్రూఫ్​ను ఫేక్​ అని ఎల్జీ ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీలోని పలు ఆలయాలను కూల్చేసేందుకు ఆదేశాలిచ్చారని ఆరోపించారు. తాము అర్చకులకు నెలనెలా రూ.18వేల వేతనం ఇవ్వాలని ప్లాన్​ చేస్తుంటే.. బీజేపీ మాత్రం ఆలయాలను 
కూల్చేసేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.