ఆపరేషన్ తెలంగాణ.. ఒక్క నెలలో 40 సభలకు ప్లాన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. అధికారమే లక్ష్యంగా ఆపరేషన్ తెలంగాణ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి వచ్చారు బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా.  ఘట్ కేసర్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ కు అటెండ్ అయ్యారు నడ్డా. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై లీడర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ఇచ్చిన హామీలు, ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పబ్లిక్ కు వివరించనున్నారు నడ్డా. ఇప్పటికే పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ప్రకటన, జాతీయ నేతల టూర్లతో క్యాడర్ లో జోష్ వచ్చింది. తాజా రాజకీయ పరిస్థితులపై ఇవాళ ముఖ్య నేతలతో డిస్కస్ చేయనున్నారు.

ALSO READ : అందరూ ఓటేసేలా..పోలింగ్​శాతం పెంపు

మరోవైపు అక్టోబర్, నవంబర్లో 40 బహిరంగ సభలకు ప్లాన్ చేసింది బీజేపీ హైకమాండ్. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల గ్యాప్ లో రెండుసార్లు తెలంగాణకు వచ్చారు. ఇప్పుడు మరికొందరు జాతీయ నేతలు రాష్ట్రానికి రానున్నారు. ఒక్క అక్టోబర్ లోనే రెండుసార్లు రాష్ట్రానికి రానున్నారు అమిత్ షా. అక్టోబర్ 10, 27 తేదీల్లో అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు.

అక్టోబర్ 20, 21 తేదీల్లో రక్షణమంత్రి రాజ్ నాథ్ టూర్ కు ఏర్పాట్లు చేస్తున్నారు కమలం నేతలు. ఇందుకు సంబంధించి అధికారికంగా షెడ్యూల్ కూడా ఖరారైంది. మరోవైపు ఇవాల్టి BJYM మీటింగ్ కు హాజరు కానున్నారు బెంగళూరు ఎంపీ తేజస్విసూర్య.