అర్హులకు డబుల్ బెడ్రూంలు ఇవ్వాలి.. బీజేపీ నేతల మహా ధర్నాకలెక్టరేట్ల ముట్టడి

అర్హులకు డబుల్ బెడ్రూంలు ఇవ్వాలి.. బీజేపీ నేతల మహా ధర్నాకలెక్టరేట్ల ముట్టడి

మంచిర్యాల, వెలుగు: అర్హులైన పేదలకు డబుల్​బెడ్రూం ఇండ్లు ఇవ్వాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో పేదలు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, బీజేపీ లీడర్లు మెయిన్​ రోడ్డు నుంచి కలెక్టరేట్​ వరకు ర్యాలీ తీసి గేటు ముందు బైఠాయించారు. హాజరైన ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్​ రాథోడ్, జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్​కు ప్రజాధనాన్ని దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ పేదల సమస్యలపై లేదన్నారు. ప్రధానమంత్రి అవాస యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ వాటిని పేదలకు దక్కకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ధర్నాలో బీజేపీ లీడర్లు పెద్దపల్లి పురుషోత్తం, అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేశ్, ముల్కల్ల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్​

ఆదిలాబాద్ ​టౌన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీఆర్​ఎస్​ సర్కారు మోసం చేసిందని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్​శంకర్​ మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్ల సాధన కోసం సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్​కలెక్టరేట్ ను​ముట్టడించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి హాజరయ్యారు. అవినీతి బీఆర్​​ఎస్ 
నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ ​రాజ్​కు వినతిపత్రం అందించారు. జడ్పీ మాజీ చైర్మన్​ సుహాసిని రెడ్డి, జిల్లా నాయకులు ఆధినత్, ప్రవీణ్ రెడ్డి, మయూర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్​కు గుణపాఠం చెప్పాలి

నిర్మల్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్​లోని ఆర్డీఓ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్​కు, జిల్లా మంత్రికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, అదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, జిల్లా అధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 

ప్రజలు తిరగబడతారు

ఆసిఫాబాద్: పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల ఆశ చూపి బీఆర్​ఎస్​పార్టీ అధికారం దక్కించుకొని మోసం చేసిందని బీజేపీ ఆసిఫాబాద్ జిల్లా పాలక్, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య మండిపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు దీక్ష చేపట్టారు. ప్రజలు ఇండ్ల కోసం తిరగబడే రోజులు వచ్చాయని వారు పేర్కొన్నారు.

తహసీల్దార్ద ఆఫీస్ ముట్టడి

ఖానాపూర్: ఖానాపూర్ పట్టణ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు తమకు కేటాయించి ఆ తర్వాత అనర్హులకు ఇచ్చారని ఆరోపిస్తూ పలువురు పేద మహిళలు సోమవారం ఖానాపూర్​తహసీల్ ఆఫీన్​ను ముట్టడించారు. ఆఫీసర్లు కుమ్మకై తమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. సగం మందికి పైగా ధనవంతులకే ఇండ్లు వచ్చాయని దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని డిమాండ్ ​చేశారు. తహశీల్దార్ రాకపోవడంతో ఆఫీసు ముందు దాదాపు 5 గంటలపాటు నిరసన తెలిపారు.