నల్గొండ జిల్లా: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఇవాళ 11వ రోజు కొనసాగుతోంది. ఇవాళ నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు శివారులో బండిసంజయ్ పాదయాత్రను ప్రారంభించారు. నకిరేకల్ నినియోజకవర్గం నుంచి తుంగతుర్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. తుంగతుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు.
తుంగతుర్తి నియోజకవర్గంలోని పొడుచేడు, అనాజీపురం, బుజ్జిలపురం, ధర్మపురం మీదుగా మోత్కూర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. మునుగోడు ఉప ఎన్నిక ముంచుకొస్తున్న తరుణంలో ఇదే జిల్లాలో కొనసాగుతున్న బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దుబ్బాకలో అనూహ్య విజయం సాధించి అటు తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ హోరాహోరీగా సాగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో విజయం సాధించిన విషయం తెలిసిందే.