తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోం చేసిందన్నారు. మోదీ పాలనలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేదన్నారు.. ఇందుకు లోక్ సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు నడ్డా.
బీజేపీ పార్టీని దేశ ప్రజలు నమ్ముతున్నారని.. అందుకే మొత్తం 13 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ సొంతం అధికారంలో ఉందన్నారు.. ఎన్డీయే కూటమి నేతృత్వంలో 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్నారు. త్వరంలో మరో రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో రాబోతుందన్నారు జేపీ నడ్డా.
ALSO READ : కేసీఆర్ గెలిస్తే అధికారం చలాయిస్తారు.. ఓడితే ఫామ్ హౌస్ లో పడుకుంటారా: సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీ చేసే ప్రజాసంక్షే కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని జేపీ నడ్డా అన్నారు. గుజరాత్ లో ఆరోసారి అధికారంలో ఉన్నాం.. హర్యానా, గోవాలో హ్యా్ట్రిక్ కొట్టాం.. అసోం, మణిపూర్ పలో రెండో సారి అధికారంలో అధికారంలోకి వచ్చామన్నారు.
కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. అక్కడ ప్రజలు సంతోషం గా లేరు..ఈ మూడు రాష్ట్రాల్లో ప్రజలు దోపిడీకి గురవుతున్నా రని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఓ పరాన్న జీవి.. ఇతర పార్టీల బలహీనతలే ఆ పార్టీ బలం అన్ని విమర్శించారు. బీజేపీ త్వరలో మరో రాష్ట్రాన్ని చేజిక్కించుకోబోతుందని అన్నారు జేపీ నడ్డా.