- మెదక్‌లో కేంద్ర మంత్రి నడ్డా.. ఎంపీ రఘునందన్ రావు ఫొటోకు క్షీరాభిషేకం
- మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీ మంజూరు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, మెదక్ఎంపీ రఘునందన్‌రావు చేసిన కృషి వల్లే సాధ్యమైందని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని బస్‌డిపో వద్ద మంత్రి, ఎంపీల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ... ఎంపీ రఘునందన్ రావు జాతీయ మెడికల్ మండలి వారితో మాట్లాడి మెదక్‌కు మెడికల్ కాలేజ్ అనుమతి వచ్చేలా కృషి చేశారన్నారు.
మెదక్ జిల్లాకు మెడికల్‌కాలేజీ అనుమతి రావడంలో నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు డాక్టర్ మురళీ గౌడ్, రఘువీరారెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, మహేశ్వరి, సత్యనారాయణ, కాశీనాథ్, రాగి రాములు, నాయిని ప్రసాద్, రాజు, రంజిత్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.