
కోల్‌బెల్ట్/బెల్లంపల్లి/మంచిర్యాల, వెలుగు: మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా బుధవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ మహంకాళీ శ్రీనివాస్ఆధ్వర్యంలో టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్వెరబెల్లి రాఘునాథ్ రావు చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ప్రధాన రోడ్లన్నీ ఆధ్వానంగా మారాయన్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ అసమర్థత కారణంగానే రామకృష్ణాపురం–మంచిర్యాల రహదారిలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు తొమ్మిదేళ్లయినా పూర్తికాలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నియోజకవర్గం కన్వీనర్ రమేశ్ తదితర లీడర్లు పాల్గొన్నారు. బీజేపీ బెల్లంపల్లి నియోజకవర్గ కన్వీనర్ రాచర్ల సంతోష్ కుమార్ అధ్యక్షతన బెల్లంపల్లి పట్టణంలో టిఫిన్ బైఠక్ కార్యక్రమం జరిగింది.
రఘునాథ్ రావు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, లీడర్లు ఎవరి సద్ది డబ్బాలు వారే తెచ్చుకొని సహపంక్తి భోజనాల్లో పాల్గొన్నారు. లీడర్లు అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్, కోడి రమేశ్, గజెల్లీ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి మండలంలో గ్రామ పంచాయతీ సిబ్బంది చేపట్టిన సమ్మె శిబిరాన్ని రఘునాథ్ రావు సందర్శించారు. వారి సమ్మెకు బీజేపీ అండగా ఉంటుందని, సమస్యల సాధనకు ఉద్యమిస్తామని తెలిపారు. అనంతరం ఆయన మంచిర్యాల మున్సిపాలిటీ 33వ వార్డు చింతపండువాడలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రజలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. టౌన్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నా పరిష్కరించడంలేదన్నారు. అనంతరం వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జడ్పీ బాయ్స్ స్కూల్ స్టూడెంట్లకు స్కూల్ కిట్లు అందజేశారు. లీడర్లు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, రేకందర్ వాణి, రెడ్డిమల్ల అశోక్, పట్టి వెంకటకృష్ణ పాల్గొన్నారు.