తెలంగాణలో 27 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు ఫైనల్

 తెలంగాణలో 27 జిల్లాలకు  బీజేపీ అధ్యక్షులు ఫైనల్
  • ఏడుగురు రెడ్డీలకు చాన్స్
  • 15 మంది బీసీలకు అవకాశం
  • వైశ్యులు ఇద్దరు, కమ్మ ఒకరు
  •  ఎస్సీలు ఇద్దరు, ఎస్టీలు  నిల్
  •  ఒకే ఒక్క మహిళకు దక్కిన చాన్స్

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ 27 జిల్లాల అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. మిగతా ఆరు జిల్లాల అధ్యక్షుల ఎన్నిక త్వరలోనే జరగనుంది. ఈ జిల్లాల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో పెండింగ్ లో పెట్టినట్టు సమాచారం. 27 జిల్లాలకు గాను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఏడుగురు ఉన్నారు. 

ALSO READ | ఆ ఏడుగురిపై కూడా వేటు వేయండి..సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్

అలాగే వైశ్యులు ఇద్దరు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒకరు ఉన్నారు. మొత్తంగా 10 మంది ఓసీలకు జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి. 15 మంది బీసీలకు ఈ సారి అవకాశం లభించింది. వీరిలో మున్నూరు కాపులు ఆరుగురు, గౌడ కులస్తులు నలుగురు, ఇతర బీసీలు ఐదుగురు ఉన్నారు. ఇద్దరు ఎస్సీలకు బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్  పోస్టులు లభించగా.. ఎస్టీలకు అవకాశం ఇవ్వలేదు. మొత్తంగా 27 జిల్లాల అధ్యక్షుల్లో ఒక మహిళ ఉన్నారు. 


జిల్లా                  అధ్యక్షుడు

1. జనగామ        చౌడ రమేష్
2. వరంగల్        గంట రవి
3. హన్మకొండ    సంతోష్ రెడ్డి
4. జయశంకర్    నిశిధర్ రెడ్డి
5. నల్గొండ         నాగం వర్షిత్ రెడ్డి
6. నిజామాబాద్    దినేష్ కులాచారి
7. వనపర్తి            నారాయణ
8. హైదరాబాద్ సెంట్రల్  దీపక్ రెడ్డి
9. మేడ్చల్ రూరల్     శ్రీనివాస్
10. ఆసిఫాబాద్     శ్రీశైలం ముదిరాజ్
11. కామారెడ్డి    నీలం చిన్న రాజులు
12. ములుగు     బలరాం
13. మహబూబ్ నగర్     శ్రీనివాస్ రెడ్డి
14. జగిత్యాల     యాదగిరి బాబు
15. మంచిర్యాల     వెంకటేశ్వర్లు గౌడ్
16. పెద్దపల్లి         సంజీవరెడ్డి 
17 ఆదిలాబాద్     బ్రహ్మానందరెడ్డి