ఆర్టికల్ 370 రద్దే రాజ్యాంగ పరిరక్షణ: ట్విట్టర్లో బీజేపీ ఆసక్తికర పోస్ట్

ఆర్టికల్ 370 రద్దే రాజ్యాంగ  పరిరక్షణ: ట్విట్టర్లో బీజేపీ ఆసక్తికర పోస్ట్

రాజ్యాంగ వజ్రోత్సవాల వేళ బీజేపీ ఆసక్తికర ట్వీట్ చేసింది. రాజ్యాంగాన్ని గౌరవాన్ని కాపాడుతూ మోదీ ప్రజా యోగ్యమైన పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.  ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారని పేర్కొంది. ‘సత్యమేవ జయతే’ అనే  నినాదంలో ప్రధాని ముందుకు సాగుతున్నారని తెలిపింది. న్యాయవ్యవస్థలో మార్పులతో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారని తెలిపింది. ఆర్టికల్ 370 రద్దుతో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగ  పరిరక్షణలో భాగంగానే నారీశక్తి బిల్లును ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు.

ALSO READ | రాష్ట్రపతిని అవమానించారు.. కాంగ్రెస్ అగ్రనేతపై బీజేపీ విమర్శలు

త్రిపుల్ తలాక్ కు సైతం రాజ్యాంగబద్ధంగానే సమాధానం చెప్పారని పేర్కొంది. మరో అడుగు ముందుకేసి అయోధ్య వివాదానికి ప్రధాని  రాజ్యాంగబద్ధంగా  చెక్ పెటారని పేర్కొంది. ‘డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మనకు అందించిన రాజ్యాంగంలో పొందుపర్చిన ఉదాత్తమైన విలువను నిలబెట్టడానికి నా జీవితం ప్రతిక్షణం అంకితం చేస్తున్నా’ అనే ప్రధాని వ్యాఖ్యలను కోట్ చేయడం విశేషం. బీజేపీ తెలంగాణ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. రాజ్యంగంలోని ఆర్టికల్స్ను రద్దు చేయడం రాజ్యాంగ పరిరక్షణ ఎలా అవుతుందనే చర్చ మొదలైంది.